వడ దెబ్బ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏ.మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్: జమ్మికుంట
- Vijaya Preetham
- Mar 12
- 1 min read
వడ దెబ్బ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఏ.మోహన్ రెడ్డి
హెల్త్ ఎడ్యుకేటర్ , జమ్మికుంట, మార్చి 11 :

వేసవి ఎండల తీవ్రతలకు ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం వుంది కాబ్బటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ ఎ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని విలాసాగర్ గ్రామములో వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలకు వడ దెబ్బ పై ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీలకు వడ దెబ్బ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించామని చెప్పారు. వడ దెబ్బ నివారణకై ప్రజలు, కూలీలు అందరూ రోజుకి 10 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు త్రాగాలన్నారు. బయటికి వెళ్లినప్పుడు గొడుగు, టోపీ, తలపాగ, తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించామన్నారు. ఉదయం, సాయంత్రం ఎండ లేని సమయంలో పనులు చేసుకోవాలని కూలీలకు సూచించామన్నారు. ఎండ వేడిమికి డి హైడ్రెషన్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ద్రావణాన్ని త్రాగాలని సూచించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలందరికి ఓఆర్ఎస్ పాకెట్స్ ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో హెల్త్ సూపర్ వైజర్ రత్న కుమారి, ఏఎన్ఎం సౌందర్య, మంజుల, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ సుధాకర్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
Comentarios