వెంకటేష్ పాడిన ‘పొంగల్’ పాట వచ్చేసింది!
- Vijaya Preetham
- Dec 30, 2024
- 1 min read
వెంకటేష్ పాడిన ‘పొంగల్’ పాట వచ్చేసింది!
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ‘గోదారి గట్టు’ మరియు ‘మీను’ పాటలకు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన లభించింది.
భీమ్స్ స్వరపరిచిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసి, వెంకటేష్, భీమ్స్, రోహిని సోరాట్ గానం చేశారు. వెంకీ తన ప్రత్యేకమైన శైలిలో హై ఎనర్జీతో పాడిన ఈ పొంగల్ పాట, సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తోంది. ఈ పాటలో వెంకటేష్‌తో పాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కూడా అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు చూపిస్తున్నారు. సంక్రాంతి ఉత్సవాలకు ప్రత్యేకంగా రూపొందిన ఈ చిత్రం, జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Kommentit