రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
- Vijaya Preetham
- Dec 23, 2024
- 1 min read

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా హూజురాబాద్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపిన
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల
ప్రణవ్
వ్యవసాయంలోనే సాయం ఉందని అలాంటి వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో రైతులతో కాసేపు మాట్లాడారు. ప్రణవ్ కు రైతులు
నాగలిని బహుకరించారు. గతంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం నుండి రైతుల సంక్షేమానికి కృషి చేసిందని దాంట్లో భాగంగానే దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా రైతులకు రుణమాఫీ చేసి వారి రుణాన్ని తీర్చుకుందని, అలాగే సన్న రకాలు వేసిన ప్రతి రైతుకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలబడ్డామని,అంతేకాకుండా వచ్చే సంక్రాంతి నుండి గతంలో ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చినటువంటి రైతుబంధు నిధులను పక్కదారి పట్టకుండా రైతు భరోసా పేరుతో పక్కగా ఇస్తున్నామని అన్నారు. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చి వారికి బాసటగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు పాల్గొన్నారు.
Comments