మధుసూదన్ రెడ్డి అకాలమరణం కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు :జమ్మికుంట
- Vijaya Preetham
- Mar 14
- 1 min read
మధుసూదన్ రెడ్డి అకాలమరణం
కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
: జమ్మికుంట

కరీంనగర్ టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అకాల మరణం చెందడంతో రాజకీయ, సామాజిక వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. శుక్రవారం పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి నిర్మల్ వెళ్లి మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ సందర్భంగా ఇల్లందకుంట మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంగిలే రామారావు, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గడ్డం దీక్షిత్, మానుపాటి సూర్య తదితరులు పాల్గొని తమ సంతాపాన్ని ప్రకటించారు. మధుసూదన్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదకరమని, కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
Comments