డాకు మహారాజ్ “ప్రీ-రిలీజ్ వేడుకకు ఉత్కంఠభరితమైన సన్నాహాలు!
- Vijaya Preetham
- Dec 28, 2024
- 1 min read
డాకు మహారాజ్- ప్రీ-రిలీజ్ వేడుకకు ఉత్కంఠభరితమైన సన్నాహాలు!

బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి సందర్భంలో విడుదలకు సిద్ధమవుతోంది. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రచారంలో వేగం పెంచేందుకు టీమ్ సన్నద్ధమవుతోంది. జనవరి 4న అమెరికా డల్లాస్ లో ‘డాకు మహారాజ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించబడే అవకాశం ఉంది.
ఇక, విదేశీ మార్కెట్‌లో ‘డాకు మహారాజ్’* అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా టికెట్లు అద్భుతమైన రేంజులో బుక్ అవుతున్నాయి. సంగీతం అందిస్తున్న ‘తమన్ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘రేజ్ ఆప్ డాకు’, ‘చిన్నీ’ పాటలు విడుదలై విశేష స్పందనను పొందాయి.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘డాకు మహారాజ్’ చిత్రంలో బాలయ్య ద్వైత పాత్రలో కనిపించనున్నారు. ఇతర కీలక పాత్రల్లో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి** నటిస్తున్నారు.
Comments