జనవరి 3న విడుదల కాబోతున్న ‘పా.. పా..’ చిత్రం
- Vijaya Preetham
- Dec 29, 2024
- 1 min read
జనవరి 3న విడుదల కాబోతున్న ‘పా.. పా..’ చిత్రం

▪️ తమిళంలో భారీ హిట్ అయిన ‘డా..డా’
▪️ తెలుగులో ‘పా.. పా..’ అనే పేరుతో విడుదల
▪️ జనవరి 3న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియాలో విడుదల
తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ చిత్రం తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో, జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుదల చేయనున్నారు. ఈ సినిమా జనవరి 3న ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటీవల డైరెక్టర్ మారుతి విడుదల చేసిన ‘పా.. పా..’ మూవీ ట్రైలర్‌కు ఆకట్టుకునే రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
గత ఏడాది తమిళంలో విడుదలైన ‘డా..డా’ చిత్రం భారీ హిట్‌గా నిలిచింది. కవిన్, అపర్ణా దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, డైరెక్టర్ గణేష్ కె బాబు దర్శకత్వంలో తెరకెక్కింది. తమిళ ప్రేక్షకులను అలరించి, కోలీవుడ్ పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమా 30 కోట్ల రూపాయల వసూళ్లతో విజయవంతం అయింది. ఈ చిత్రంలోని హార్ట్ టచ్ పాటలు కూడా ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందాయి. చిత్ర యూనిట్ ప్రకారం, ఈ సినిమా పాటలు జ్ఞాపకార్హంగా నిలిచిపోతాయని భావిస్తున్నారు.

‘డా..డా’ చిత్రం తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగం, ప్రేమ, కామెడీ తదితర అంశాలతో బాగా ఆకట్టుకున్నది. ఈ సినిమా ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా అన్న దానిపై, తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉందని, బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని చెప్పారు.
జనవరి 3న తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఎంజీఎం సంస్థ ద్వారా అచ్చిబాబు విడుదల చేయనున్నారు.
ప్రొడక్షన్ హౌస్ : JK ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : నీరజ కోట
హీరో :కవిన్
హీరోయిన్: అపర్ణా దాస్
నటీనటులు: భాగ్యరాజా, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి
సాహిత్యం :రవివర్మ ఆకుల
పీఆర్వో : కడలి రాంబాబు, అశోక్ దయ్యాల
댓글