ఘనంగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు
- medhalouise
- Dec 21, 2024
- 1 min read

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు టంగుటూరి రాజకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిత్యం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పొనగంటి సంపత్ పిఎసిఎస్ చైర్మన్, మాజీ మార్కెట్ చైర్మన్ పోల్సాని సత్యనారాయణరావు, ములుగు దిలీప్ ,వార్డు కౌన్సిలర్లు గాజుల భాస్కర్, దయ్యాల శ్రీనివాస్, జుగురు సదానందం, మాజీ ఫిషరీస్ కరీంనగర్ వైస్ చైర్మన్ ముద్రగడ నవీన్ కుమార్, మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేష్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ 30 వార్డుల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పర్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కట్ చేసి పిల్లలకు పండ్లు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పర్లపల్లి రమేష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో, పార్టీ కార్యకర్తల అండదండలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని. వారు ఏ నిర్ణయం తీసుకున్న నియోజకవర్గ ప్రజలు వారికి తోడుగా ఉంటూ వారి అడుగుజాడల్లో నడుస్తామని మాట్లాడారు
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు టంగుటూరి రాజ్ కుమార్, పొనగంటి సంపత్ పిఎసిఎస్ చైర్మన్, గాజుల భాస్కర్, భోగం వెంకటేష్, మంద రాజేష్, ముద్రగడ నవీన్, రాచపల్లి ప్రశాంత్, గూట్ల మల్లికార్జున్, బండారి ప్రశాంత్, ఎండి సలీం, నాయకులు, కార్యకర్తలు, కౌశిక్ రెడ్డి గారి అభిమానులు పాల్గొన్నారు.
Σχόλια