గేమ్ ఛేంజర్’ పై సుకుమార్ మొదటి రివ్యూ!
- Vijaya Preetham
- Dec 22, 2024
- 1 min read
Updated: Dec 23, 2024
రామ్ చరణ్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ **‘గేమ్ ఛేంజర్’** సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా, డల్లాస్ (అమెరికా)లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించబడింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన క్రియేటివ్ జీనియస్ సుకుమార్, **‘గేమ్ ఛేంజర్’** సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సుకుమార్ మాట్లాడుతూ, “నేను, చిరంజీవి గారు ఈ సినిమా చూశాం. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పించాయి. క్లైమాక్స్‌లో రామ్ చరణ్ అవార్డు విన్నింగ్ స్థాయి నటనను ప్రదర్శించాడు” అన్నారు. ఈ రివ్యూ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉందని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరొక వైపు, **‘రంగస్థలం’** తర్వాత రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నాడు సుకుమార్. ప్రస్తుతానికి ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చరణ్-సుక్కూ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుంది.
#GameChanger #RamCharan #Shankar #SankrantiRelease #Sukumar #MegaFamily #Chiranjeevi #Rangasthalam #GameChangerPreRelease #DallasEvent #RamCharanPerformance #AwardWinningPerformance #FilmInsights #TeluguCinema #IndianCinema #GameChanger2024 #RamCharanSukumarCollaboration #MegaFamilyFans #BlockbusterFilm #ClimaxReview #SukumarReview
Comments