top of page

గోదారి గట్టు సాంగ్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. 'సంక్రాంతికి వస్తున్నామ్' ఫెంటాస్టిక్ మూవీ. డెఫినెట్ గా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది: సింగర్ రమణ గోగుల

  • medhalouise
  • Dec 18, 2024
  • 4 min read

The response to the song 'Godari Gattu' has been incredible, and it's brought a lot of joy. 'Sankranthiki Vasthunnam' is a fantastic movie that will definitely entertain everyone, says singer Ramana Gogula.



విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన Anil Ravipudi, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నామ్'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గోదారి గట్టు సాంగ్  27 మిలియన్ వ్యూస్  క్రాస్ చేసి చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. రమణ గోగుల పాడిన ఈ పాట సోషల్ మీడియాతో పాటు అన్నీ మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూ వైరల్ గా మారింది. జనవరి 14న  'సంక్రాంతికి వస్తున్నాం' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సింగర్ రమణ గోగుల విలేకరుల సమవేశంలో 'సంక్రాంతికి వస్తున్నామ్' విశేషాల్ని పంచుకున్నారు.


Victory Venkatesh, the blockbuster hit machine Anil Ravipudi, and the highly successful banner Sri Venkateswara Creations are coming together for the highly anticipated movie 'Sankranthiki Vasthunnam.' Produced grandly by Shirish under the presentation of Dil Raju, the film stars Meenakshi Chaudhary and Aishwarya Rajesh as the heroines. The sensational composer, Bheems Ceciroleo, has provided the music. The song 'Godari Gattu' from the film has already crossed 27 million views and has become a chartbuster hit. Sung by Ramana Gogula, the song is trending on music charts and going viral on social media. The movie will release on January 14. On this occasion, singer Ramana Gogula shared insights about the film 'Sankranthiki Vasthunnam' during a press meet.


---


గోదారి గట్టు ఆల్రెడీ 27 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది ?

-చాలా గ్రేట్ ఫుల్ గా ఉంది. నా పాటని అభిమానించే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మళ్లీ నేనెప్పుడూ పాడుతానా అని ఎదురు చూశారు. నేను నా వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయాను. యూఎస్ లో ఉన్నాను. నేను ఎవరి సంగీతంలో ఇప్పటివరకు పాడలేదు. కానీ అనిల్, బీమ్స్ చాలా లవింగ్ పర్సన్స్. ఫెంటాస్టిక్ యాటిట్యూడ్ తో ఉంటారు. వెంకటేష్ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్. నా తొలి సినిమా వెంకటేష్ గారి ప్రేమంటే ఇదేరా. ఇలాంటి మంచి కాంబినేషన్లో వస్తున్న ఈ పాటని పాడాలని అనుకున్నాను.  బీమ్స్ లవ్లీ గా కంపోజ్ చేశారు. పాటకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందం ఇచ్చింది. లైఫ్ ఫుల్ సర్కిల్ అయిందనే ఫీలింగ్ వచ్చింది


Godari Gattu has already crossed 27 million views. How does that response feel?

- I feel very grateful. There are so many fans who love my song. They’ve been waiting for me to sing again. I got busy in my personal life and was in the US. I hadn’t sung in anyone’s music until now. But Anil and Bheems are very loving and have a fantastic attitude. Venkatesh is a great friend of mine. My first movie, "Venkatesh Garu Prema," is a special memory. I wanted to sing this song because of the amazing combination. Bheems composed it beautifully. The wonderful response to this song is a lot of joy. I feel like life has come full circle.


---


ఈ పాట మీ వద్దకు ఎలా వచ్చింది?

-నేను యూస్ లో ఉన్నాను. బీమ్స్ కాల్ చేసి తప్పకుండా ఈ సినిమాలో పాట పాడాలని కోరారు. సాంగ్ పంపించమని అడిగాను. పాట ఒక రెండు సార్లు విన్నాను. చాలా నచ్చింది. పాటలో ఒక హార్ట్ ఉంది. డెఫినెట్ గా పాడాలి అనిపించింది. అలా ఈ పాట పాడాను. ఈ పాట పాడటానికి చాలా క్రియేటివ్ ఫ్రీడం దొరికింది.


How did this song come to you?

- I was in the US when Bheems called and insisted that I sing for this film. I asked him to send me the song. I listened to it a couple of times and really liked it. There was a heart in the song, and I definitely felt like I had to sing it. I was able to sing this song with a lot of creative freedom.


మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. నా వాయిస్ కి వాయిస్ కి పర్ఫెక్ట్ గా  బ్యాలెన్స్ అయింది. భాస్కర భట్ల గారు పెంటాస్టిక్ గా రాశారు.


Madhupriya also sang wonderfully. Her voice balanced perfectly with mine. Bhaskar Batla wrote the lyrics wonderfully.


ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందం ఇచ్చింది. ఓ వ్యక్తి ఫోన్ చేసి మా ఊర్లో పొద్దున లేస్తే ఇదే పాట వేస్తున్నారు అందరూ డాన్స్ చేస్తున్నారని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వాయిస్ లోఅదే మ్యాజిక్ ఉందని ఆడియన్స్ చెప్పడం చాలా హ్యాపీనెస్ నిచ్చింది. 'సంక్రాంతికి వస్తున్నామ్' గ్రేట్ ఫిల్మ్. అనిల్ అద్భుతంగా తీశారు. సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది.


The response to this song has brought a lot of joy. One person called me and said that in their village, when people wake up in the morning, this is the song they play, and everyone dances to it. Hearing the audience say there’s magic in the voice was very rewarding. 'Sankranthiki Vasthunnam' is a great film. Anil has done a wonderful job, and the movie will entertain everyone.


---


వెంకటేష్ గారి రెస్పాన్స్ ఎలా ఉంది?

-వెంకటేష్ గారు కాల్ చేశారు. నేను మళ్లీ పాట పాడడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఆయనకి పాట చాలా నచ్చింది.  ఆయనలో అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు లేదు. అదే మ్యాజిక్ ఉంది. ఆయన రాక్ స్టార్.


How was Venkatesh Garu's response?

- Venkatesh Garu called and said he was very happy that I sang again. He really liked the song. There’s no change in him, he still has the same magic. He is a rock star.


ఇండస్ట్రీ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయి. అందరూ అభినందించారు.


I also received a lot of calls from the industry, and everyone congratulated me.


---


మళ్లీ మీరు ఎప్పుడు కంపోజ్ చేయబోతున్నారు?

-నేను సిద్ధంగా ఉన్నాను. అయితే అన్నీ కుదరాలి. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చాలా అద్భుతంగా సంగీతం చేస్తున్నారు. పాటలు ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. అయినా ఒక న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కడో చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా దగ్గర కొన్ని వినూత్నమైన ఐడియాలు వున్నాయి. యాక్టర్, స్టొరీ, డైరెక్టర్ సరైన సమయంలో పర్ఫెక్ట్ గా కుదరాలి.  తప్పకుండా నా నుంచి మ్యూజిక్ ని ఆడియన్స్ ఆశించవచ్చు.


When will you compose music again?

- I’m ready. But everything has to align. All the music directors out there are doing amazing work, and the songs are fantastic. However, there is a small gap somewhere for a new kind of music. I’m ready to fill that gap. I have some innovative ideas. The right actor, story, and director have to come together at the perfect time. Audiences can definitely expect music from me soon.


---


గ్యాప్ రావడానికి కారణం ఏంటి?

-నేను అబ్రాడ్ లో మల్టీ నేషనల్ కంపెనీస్ కి వర్క్ చేశాను, నాకు టెక్నాలజీ చాలా ఇష్టం.   ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా ఎనలిటిక్స్  ప్రాజెక్ట్స్ లో చేశాను.


Why did the gap happen?

- I worked with multinational companies abroad and have a deep interest in technology. I worked on projects in artificial intelligence and data analytics.


---


అప్పటికి ఇప్పటికీ మ్యూజిక్ టెక్నాలజీ లో ఎలాంటి మార్పులు వచ్చాయి?

-చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా అసలు ఒక సింగర్ పాట పాడాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా సాంగ్ వస్తుంది. అయితే ఒక పాటకి హార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అది హ్యూమన్ టచ్ తోనే సాధ్యమవుతుంది.


What changes have occurred in music technology over time?

- A lot has changed. With artificial intelligence, a singer no longer needs to sing, as songs are generated automatically. But the most important element in a song is its heart, and that can only come with a human touch.


---


పవన్ కళ్యాణ్ గారితో మీది బ్లాక్ బస్టర్  కాంబినేషన్ కదా.. ఆయనతో వర్కింగ్ ఎలా ఉండేది?

-పవన్ కళ్యాణ్ గారు క్రియేటివ్ పర్సన్. చాలా కొత్తగా ప్రయత్నిస్తారు. ఫస్ట్ టైం తెలుగు సినిమాల్లో ఇంగ్లీష్ పాట ఆయన  సినిమా కోసమే కంపోజ్ చేయడం జరిగింది. ఆయన విన్న వెంటనే ఈ పాట చేస్తున్నామని కాన్ఫిడెంట్ గా చెప్పారు. అది ఒక మ్యాజిక్ లో జరిగింది.  ఇప్పుడు ఆయన చాలా గొప్ప స్థాయిలో వుండటం చాలా ఆనందంగా వుంది.


You had a blockbuster combination with Pawan Kalyan, right? How would working with him be?

- Pawan Kalyan is a creative person. He tries new things. For the first time, he asked me to compose an English song for a Telugu movie. When he heard it, he confidently said we would go ahead with it. It happened like magic. Now, I’m very happy to see him at such a great level.


---


మీరు పాడిన పాటల్లో మీకు ఇష్టమైన సాంగ్?

-నాకు ఇష్టం లేకపోతే కంపోజ్ చేయను. నాకు అన్ని ఇష్టమే. ఒక్కటి చెప్పాలంటే యువరాజు సినిమాలో మనసేమో చెప్పిన మాటే వినదు పాట నాకు చాలా ఇష్టం. అది గ్రేట్ కాంపోజిషన్.


What’s your favorite song among the ones you’ve sung?

- If I didn’t like it, I wouldn’t have composed it. I love all the songs I’ve sung. If I had to pick one, it would be 'Manasemo Cheppina Maathe Vinadhu' from the movie 'Yuvraju.' It’s a great composition.


---


ఆల్ ది బెస్ట్ 

-థాంక్ యూ


All the best.

- Thank you.



Comments


JOIN OUR MAILING LIST

Sign up to receive exclusive updates, behind-the-scenes content, and more!

  • Instagram
  • Facebook
  • X
  • YouTube
  • Whatsapp

© 2024 Vijaya Preetham. All rights reserved.

bottom of page